ప్రజాశక్తి – కడప అర్బన్ వామపక్షాల ఆధ్వర్యంలో కడప నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఈనెల 28న నిర్వహించే విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, బి. దస్తగిరి రెడ్డి పిలుపునిచ్చారు. మంగ ళవారం సిపిఎం జిల్లా కార్యాల యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 28న ఆనాటి పాలకులు ప్రపంచ బ్యాంకు షరతులో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపునకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వామపక్షాలు, కాంగ్రెస్ శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఉద్యమం నిర్వహించాయని పేర్కొన్నారు. ఆ ఉద్యమం అనంతరం చలో హైదరాబాద్ పిలుపునిచ్చారని తెలిపారు. 60 మంది శాసనసభ్యులు ఆమర నిరాహార దీక్ష చేస్తున్నా అప్పటి ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదర్శన చేస్తున్న కార్యకర్తల పైన లాఠీలు, తూటాలు ఉపయో గించారన్నారు. ఈ దాడుల్లో సిఐటియు, సిపిఎం, రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు ము గ్గురు ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. వారికి స్ఫూర్తిగా బుధవారం జరగ బోయే సంస్కరణ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నేటి పాల కులు తిరిగి విద్యుత్తులో స్మార్ట్ మీటర్ల వ్యవస్థను తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గహలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిం దన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాదేశాలకు లొంగి రాష్ట్రంలోని నివాస గహాలకు విద్యుత్ ప్రీపె యిడ్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని గత వైసిపి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అదే విధానాన్ని తెలు గు దేశం కూటమి ప్రభుత్వం అమలుకు సిద్ధపడడం సరికాదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ల ప్రక్రియను కొనసా గించడానికి నిర్ణయించు కోవడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో అదానీ సంస్థకు చెందిన మీటర్లను తెచ్చి విద్యుత్ కార్యా లయాల్లో భద్రపరుస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లు బిగిస్తున్నారని తెలిపారు. ఆదాని, షిర్డీ సాయి తదితర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. బిగించిన మీటర్లను తొలగించాలని తెలిపారు. అప్పుడే నిజమైన విద్యుత్ ఉద్య మంలో అమరులైన వారికి మనం నివాళులు అర్పించడం అవుతుందని చెప్పారు. కార్యక్రమానికి వామపక్ష జిల్లా కార్యదర్శి, ప్రజాతంత్ర వాదులు పాల్గొ ంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు పద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
