ఫొటో : కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
హౌసింగ్ కాంప్లెక్స్ ప్రారంభం
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : వేమిరెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో బుచ్చిరెడ్డిపాళెం ఖాజా నగర్‌లో ఆల్ అమీన్ మసీదు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గృహ సముదాయాన్ని స్థానిక టిడిపి నాయకులు బచ్చా భారు ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా ఎన్నికలలో తమ విజయానికి కృషి చేసిన బుచ్చిరెడ్డిపాళెం ముస్లిం మైనారిటీ నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం తనతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చిన మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు ఆమె అభినందనలు తెలియజేశారు. టిడిపికి చెందిన పాత కొత్త కౌన్సిలర్లు సమన్వయం చేసుకొని బుచ్చి పట్టణ మౌలిక సదుపాయాలకు సహకరించాలన్నారు. బుచ్చి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తనకు సహకరించాల్సిందిగా స్థానిక నాయకులను కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజా మురళి, నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అర్బన్, రూరల్ మండల అధ్యక్షులు ఎం వి శేషయ్య, బత్తల హరికృష్ణ, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ తాళ్ళ స్వామి, యువ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు శ్రీదేవి, కత్తి నాగరాజు, పఠాన్ నస్రీన్, రాచూరి సత్యం, ప్రసాద్, రహమత్, నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.