అభివృద్ది పనులను పరిశీలించిన కమీషనర్ : కమీషనర్ నల్లనయ్య

Nov 29,2024 16:15 #Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య శుక్రవారం పరిశీలించారు. నూతనంగా సీసీ కాలువలు, పైపులైను పనులు,సీసీ రోడ్లు, కల్వర్టులు నిర్మించిన ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు సిబ్బందితో ఆయా ప్రాంతాలకు వెళ్లి నిర్మాణాల నాణ్యత ప్రమాణాలను గమనించారు. అలాగే వివిధ ప్రాంతాలలో పర్యటించిన ఆయన ప్రజావసరాలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సిబ్బందికి సూచించారు. నగరం అభివృద్ధి దిశగా పయనించాలంటే ప్రజా సహకారం కూడా అవసరమని స్థానికులతో చెప్పారు. వీధులలో చెత్తాచెదారాలు వేయరాదని, తడి చెత్త పొడి చెత్త వర్గీకరించి ప్రతి ఇంటికి వచ్చే చెత్త తరలించే వాహనానికి అందివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందేనని అన్నారు. అందుకే పూర్తి పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో జరిగిన అభివృద్ధి పనులను తామే స్వయంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. చేపట్టిన అభివృద్ధి పనుల్లో కచ్చితంగా పారదర్శకత ఉన్న నాడు పదికాలాలు నిర్మాణాలు పటిష్టంగా ఉంటాయని ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

➡️