అర్బన్‌ రీ సర్వే ప్రక్రియ వేగవంతం : కమిషనర్‌

Nov 28,2024 20:47

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగర పరిధిలో చేపడుతున్న అర్బన్‌ రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని సిబ్బందికి అడ్మిన్‌ కార్యదర్శులకు కమిషనర్‌ పల్లి నల్లనయ్య ఆదేశించారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్బన్‌ రీసర్వే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాటికి తగిన పరిష్కార మార్గాలను చూపారు. అడ్మిన్‌, ప్రణాళిక కార్యదర్శులు, సిబ్బంది సమన్వయంతో రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క అసెస్మెంట్‌ తప్పకూడదని అన్నారు. శనివారం నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయాల పరిధిలో ఉన్న హద్దుల వరకు ఎవరి పరిధిలో వారు భూమి యొక్క సమాచారం, హక్కుదారుల సమాచారం నిక్షిప్తం చేయాలని అన్నారు. ఏ ఇంటికి అసెస్మెంట్‌ ఉందో లేదో సులభతరంగా తెలుసుకునేందుకు స్టిక్కర్లు అతికించే ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభించాలని తెలిపారు. ఇఆర్‌పిని తక్షణమే డౌన్‌లోడ్‌ చేసే ప్రక్రియను మొదలు పెట్టాలని అన్నారు. ఇంటింటికి తమ సచివాలయ కార్యదర్శులు సిబ్బంది వచ్చి స్టిక్కర్లు అతికిస్తారని కావున ప్రజలు సిబ్బందితో సహకరించాలని కోరారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు రమణమూర్తి, హరిబాబు, సర్వేయర్‌ సింహాచలం, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️