ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, ఇతర అధికారులతో కలిసి 7 వ డివిజన్ దాసన్నపేట ప్రాంతంలో పర్యటించారు. కాపు వీధి, యాతవీధి, ఏనుగుల తోట, దాసన్నపేట, గౌడ వీధి తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో పశువులను రహదారులపై విచ్చలవిడిగా విడిచిపెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే పశువులను నిర్దేశిత ప్రాంతాల్లో నిలుపుదల చేయాలని, విచ్చలవిడిగా పశువులను విడిచిపెట్టరాదని కమిషనర్ తెలిపారు. వృథాగా నీటిని విడిచిపెట్టొద్దని, ప్రతి కుళాయికి ఆన్ ఆఫ్ స్విచ్ లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, స్థానిక కార్పొరేటర్ పొంతపల్లి మాలతి, ఎసిపి హరిబాబు, టిపిఆర్‌ఒ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.