వృత్తి నైపుణ్య పురస్కారాలు అందజేత

ప్రజాశక్తి- అద్దంకి : రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సింగరకొండ వారి ఆధ్వర్యంలో 11 మందికి వృత్తి నైపుణ్య పురస్కారాలు ప్రదానం చేశారు. సింగరకొండలోని శ్రీరామ వద్ధుల ఆశ్రమంలో బుధవారం ఈ పురస్కారాలు అందజేశారు.రొటేరియన్‌ అన్నంగి సుబ్బారావు మనుమడు అభిరామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, కార్యదర్శి చుండూరి మురళీసుధాకరరావు, ట్రెజరర్‌ మలాది శ్రీనివాసరావు, వీరవల్లి సుబ్బారావు, జ్యోతిచంద్రమౌళి, డాక్టర్‌ దేవపాలన, పువ్వాడ రామకోటేశ్వరావు, పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి, అన్నంగి సుబ్బారావు,ఊటుకూరు రామ కోటేశ్వరావు, సంకా సుబ్రహ్మణ్యం, కాకర్ల వెంకటేశ్వర్లు, మన్నం త్రిమూర్తులు,నర్రా శ్రీలక్ష్మి, జాగర్లమూడి శివకుమారి, కొల్లా భువనేశ్వరి, పేరయ్య, రంగారావు, ఆర్‌వి. రాఘవరావు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న వారు వీరే… వీరేపల్లి వెంకటేశ్వర్లు,బత్తుల ఆంజనేయులు, వెంకటేశ్వరావు, సుందరరావు, కొలకలూరి నాగేశ్వరావు, పోలంరాజు మారుతీ, కోటేశ్వరరావు, శివన్నారాయణ, చెన్నుపల్లి అంజిబాబు, బడే సాహెబ్‌, అంబలగిరి వెంకటరావు వృత్తి నైపుణ్యపురష్కారాలు అందుకున్నారు.

➡️