ప్లే స్కూల్స్‌ ముసుగులో ప్రైమరీ తరగతులపై ఫిర్యాదు

Private teachers vinathi to DEO

ప్రజాశక్తి -గాజువాక : ప్లే స్కూల్‌ ముసుగులో ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారని విశాఖ జిల్లా ప్రైవేట్‌ పాఠశాలల సంఘం (అప్సా) నాయకులు పాలవలస భాస్కరరావు మంగళవారం డిఇఒ ఎల్‌.చంద్రకళకు ఫిర్యాదు చేశారు. ప్లే స్కూల్స్‌ ముసుగులో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిటీ పరిధిలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పూర్వ ప్రాథమిక తరగతులతో పాటు ప్రాథమిక తరగతులు కూడా నిర్వహిస్తున్నారని, అటువంటి విద్యార్థుల పేర్లు ఆన్‌లైన్‌లో కూడా నమోదు కావడం లేదని తెలిపారు. అధికారులు స్పందించి ఆయా స్కూళ్లపై తగు చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరారు. డిఇఒను కలిసినవారిలో జాయింట్‌ సెక్రటరీ గిరీష్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, ఫణీంద్ర ఉన్నారు.

➡️