పోసాని కృష్ణ మురళిపై టిడిపి నాయకుల ఫిర్యాదు

Nov 14,2024 20:36

ప్రజాశక్తి-విజయనగరం కోట : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ , హోంశాఖా వంగలపూడి అనిత , రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ , టిటిడి చైర్మన్‌ బి.ఆర్‌. నాయుడు పై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం టిడిపి నాయకులు ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ వి పి.రాజు, నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యదర్శి బంగారు బాబు, కనకల మురళీ మోహన్‌, విజ్జి ప్రసాద్‌, కుర్రోతు నర్సింగరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️