పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

Sep 30,2024 21:30
ఫొటో : మందులు అందజేస్తున్న దృశ్యం

ఫొటో : మందులు అందజేస్తున్న దృశ్యం

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రజాశక్తి-కావలి : డాక్టర్‌ రామ్‌సెంటర్‌ విశ్వోదయ ఆధ్వర్యంలో పౌష్టికాహారం మాసోత్సవాలు ముగింపులో భాగంగా సోమవారం కావలి పాతవూరులోని అంగనవాడీ కేంద్రంలో పోషకాహారాలపై గర్భిణులకు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామ్‌సెంటర్‌ చైర్మన్‌ దొడ్ల మనోహరరెడ్డి, డైరెక్టర్‌ కూనం తాతిరెడ్డి, సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి మాట్లాడుతూ పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, చిరుధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారించడం గురించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని మహిళలు తీసుకోవాలన్నారు. చిరుధాన్యాలతో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మహిళలు, గర్భిణులు, బాలింతలు, రక్తహీనత ఉన్న వారు వాటిని తీసుకోవాలని పేర్కొన్నారు. తదుపరి డాక్టర్‌ రామ్‌సెంటర్‌ విశ్వోదయ వారు రక్తహీనతను అధిగమించడానికి ఐరన్‌ పొలిక్‌ సిరఫ్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ రామ్‌సెంటర్‌ చైర్మన్‌ దొడ్ల మనోహరరెడ్డి, డైరెక్టర్‌ కూనం తాతిరెడ్డి, సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి, అంగనవాడీ టీచర్లు రమణమ్మ, జ్యోతి, సర్తాజ్‌, మహిళా సంరక్షణ కార్యదర్శి పవన కుమారి, గర్భిణులు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు.

➡️