ప్రజాశక్తి -కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ప్రతినిత్యం పౌష్టికాహారం తీసుకుని వైద్య సలహాలు పాటించడం ద్వారా పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యవంతంగా ఉంటారని పీహెచ్సీ వైద్యాధికారిణి డా. పి ఎన్ ఎస్ డి రత్నకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కపిలేశ్వరపురం మండలంలోని అంగర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి స్త్రీలకు నిర్వహించిన ప్రత్యేక వైద్య పరీక్షల్లో వైద్యాధికారులు రత్నకుమారి, ఆధ్వర్యంలో 24 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేశారు. అనంతరం గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు , పౌష్టికాహారం ,ఆరోగ్య ఆసరా, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత , ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను ఎం పి హెచ్ ఈ ఓ జె మల్లికార్జునుడు, హెల్త్ ఎడ్యుకేటర్ బి రామారావు వివరించారు. అనంతరం కామ్రేడ్ జిత్తుక వెంకన్న 22వ వర్ధంతిని పురస్కరించుకొని అంగర పిహెచ్ సి కి వచ్చిన గర్భిణీలకు బాలింతలకు జిత్తుక వెంకన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు రకాల పండ్లు, పౌష్టికాహారం కిట్లను అందజేశారు. కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ,టి.మేరీమణి , ఎం ఎల్ హెచ్ పి కె రమా దేవి, స్టాఫ్ నర్స్ జె బంగారుపాప , లాబ్ టెక్నీషియన్ ఆలీ, ఏఎన్ఎంలు, అంగనవాడి, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు.