ముగిసిన బ్యాడ్మింటన్‌ పోటీలు

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒంగోలు లార్డ్‌ కృష్ణా బ్యాడ్మింటన్‌ అకాడమీలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న 51వ జిల్లా స్ధాయి బ్యాడ్మింటన్‌ సెలక్షన్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆదివారం నిర్వహించిన అండర్‌-11 బాలుర సింగిల్స్‌లో విజేతగా ఆఫ్రాన్‌, ఉప విజేతగా ఆర్యనందన్‌ నిలిచారు. బాలుర డబుల్స్‌లో విన్నర్‌గా అఫ్రాన్‌, రన్నర్‌గా కుషాల్‌ శ్రీ గెలుపొందారు. .బాలికల సింగిల్స్‌లో విజేతగా రబియా, ఉప విజేతగా ఇషిత నిలిచారు. బాలికల డబుల్స్‌లో విన్నర్స్‌గా రబియా ఇషిత, రన్నర్స్‌గా ఆరాధ్య, స్కంద గెలుపొందారు. అండర్‌- 13 బాలుర సింగిల్స్‌లో విజేతగా జి.షణ్ముఖ వర్ధన్‌, ఉప విజేతగా శ్రయాష్‌ గెలుపొందారు. బాలుర డబుల్స్‌ లో షణ్ముక్‌, అక్షాజ్‌ విన్నర్స్‌గా, ఎస్‌కె ఆఫ్రాన్‌,, కుషాల్‌ రన్నర్స్‌గా నిలిచారు. బాలికల సింగిల్స్‌లో ఎస్‌. మనస్వీ విజేతగా, ఆశశ్రీ ఉప విజేతగా గెలిచారు. డబుల్స్‌ లో ఎస్‌కె రబియా, ఇషిత విన్నర్స్‌గా, ఆరాధ్య, స్కంద రన్నర్స్‌ గా గెలు పొందారు. అండర్‌- 15 బాలుర సింగిల్స్‌ లో షణ్ముఖ్‌ విజేతగా శ్రయాష్‌ రన్నర్‌గా నిలిచారు. బాలుర డబుల్స్‌లో అనుప్‌ నాయక్‌, జి.విమల్‌ విజేతలుగా, వినరు, విపిన్‌ రన్నర్స్‌ గా గెలిచారు. బాలికల సింగిల్స్‌లో మనస్వి విజేతగా, ఆషాశ్రీ ఉప విజేతగా నిలిచారు. బాలికల డబుల్స్‌ లో డి. ఆషశ్రీ, ఎస్‌.మనస్విని విన్నర్స్‌గా, మౌనిక, త్రిభువన్‌ శ్రీ రన్నర్స్‌గా గెలుపొందారు. అండర్‌-16 బాలుర సింగిల్స్‌ లో తారక్‌రామ్‌ చరణ్‌ విజేతగా వెంకట్‌ సాయి వర్షిత్‌ ఉప విజేతగా నిలిచారు. బాలుర డబుల్స్‌లో అభిలాష్‌, రిషి విన్నర్స్‌గా, తారక్‌ రామ్‌ చరణ్‌, ప్రేమ్‌ కుమార్‌ రన్నర్స్‌గా గెలిచారు. బాలికల సింగిల్స్‌లో కెసరియా విజేతగా, నితిక ఉప విజేతగా గెలుపొందారు. .డబుల్స్‌లో శ్రీజ, మనస్వి విజేతలుగా నిలిచారు. అండర్‌-19 బాలుర సింగిల్స్‌లో శ్రీధర్‌ రెడ్డి విజేతగా, సూర్య కిరణ్‌ ఉప విజేతగా గెలుపొందారు. బాలుర డబుల్స్‌లో సూర్య కిరణ్‌, అభిలాష్‌ విన్నర్స్‌గా, విమ సాయి, రిషి రన్నర్స్‌గా నిలిచారు. బాలికల సింగిల్స్‌ లో సరయు విజేతగా శ్రీజ ఉప విజేతగా గెలిచారు. మెన్స్‌ సింగిల్స్‌లో పి. సుమంత్‌, డబుల్స్‌లో పి. సుమంత్‌,శశిధర్‌ విజేతలుగా నిలిచారు. ఉమెన్‌ సింగిల్స్‌లో కె.సరయు విజేతగా, అనుశ్రీ ఉప విజేతగా గెలిచారు. ఉమెన్‌ డబుల్స్‌ లో సౌమ్య, మౌనిక విన్నర్స్‌గా, అనుశ్రీ, నందిని రన్నర్స్‌గా నిలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో డి.వసంత రావు, కె.సరయు విజేతలుగా ఎస్‌కె.కలాం, ,వైష్ణవి ఉపవిజేతలుగా నిలిచారు. విజేతలు, ఉప విజేతలకు లార్డ్‌ కృష్ణ బ్యాడ్మింటన్‌ అకాడమీ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ అద్దంకి మురళీ కష్ణ ట్రోఫీ లుఅందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌ రెడ్డి, కార్యదర్శి పి. విజరు, రవిబాబు, రఘు, శ్రీనివాసరావు పాల్గొన్నారు

➡️