విద్యార్థులకు కంప్యూటర్లు అందజేత

Jun 9,2024 21:38
ఫొటో : కంప్యూటర్‌ను అందజేస్తున్న చంద్ర కంప్యూటర్స్‌ అధినేత చంద్రశేఖర్‌

ఫొటో : కంప్యూటర్‌ను అందజేస్తున్న చంద్ర కంప్యూటర్స్‌ అధినేత చంద్రశేఖర్‌
విద్యార్థులకు కంప్యూటర్లు అందజేత
ప్రజాశక్తి-మర్రిపాడు : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి 550 పైన మార్కులు సాధించిన జిల్లాలోని 600 మందికి పైగా విద్యార్థులకు ప్రోత్సాహకంగా చంద్ర కంప్యూటర్‌ వరల్డ్‌ అధినేత చంద్రశేఖర్‌ తమ సొంత నిధులతో కంప్యూటర్లు అందజేశారు. ఇప్పటివరకు 300మంది విద్యార్థులకు కంప్యూటర్లు ఇచ్చామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందజేస్తామన్నారు. ఈ సందర్బంగా చంద్ర కంప్యూటర్స్‌ అధినేత చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతిభను ప్రోత్సహించి, విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో తమ సహకారాన్ని అందజేయాలనే సదుద్దేశంతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కంప్యూటర్లు అందజేస్తున్నామన్నారు. ఆదివారం జరిగిన కంప్యూటర్ల బహూకరణ కార్యక్రమంలో కంప్యూటర్‌ అందుకున్న చుంచులూరు గ్రామానికి చెందిన కలిశెట్టి జ్ఞాపిక తండ్రి రాజేంద్రకుమార్‌ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేసి చంద్ర కంప్యూటర్‌ వరల్డ్‌ అధినేత చంద్రశేఖర్‌ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ఎంతో నిరూపమానమైనదనీ, మంచి సదుద్దేశంతో వారు అందజేసిన కంప్యూటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చంద్ర కంప్యూటర్‌ వరల్డ్‌ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️