ఎల్ఐసి పెన్షనర్ల ఆందోళన

Jan 10,2025 16:01 #Lic, #srikakulam

ప్రజాశక్తి- శ్రీకాకుళం :  ఈరోజు మధ్యాహ్నం శ్రీకాకుళం ఎల్ఐసి బ్రాంచి కార్యాలయం ఎదుట భోజనం విరామ సమయంలో ఎల్ఐసి పెన్షనర్ల నిరసన కార్యక్రమం జరిగింది.  ఐసిఆర్ఇఎ (ICREA) శ్రీకాకుళం బ్రాంచ్ అధ్యక్షులు కె. నారాయణ, కార్యదర్శి ఎం ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కె. నారాయణ అధ్యక్షత వహించారు. సంఘీభావంగా ఐసిఇయు తరఫున మెట్ట మధుసూదన్ రావు, జి శ్రీరామ్ మూర్తి, ఎన్ ఎఫ్ ఐ ఎఫ్ డబ్ల్యూ ఐ తరఫున శ్రీకాకుళం శాఖ అధ్యక్షుడు డోల తారకరామారావు, సీనియర్ నాయకులు డివి నరసింహారావు, క్లాస్ వన్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తరఫున శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెన్షన్ అప్డేట్ చేయాలని ఎల్ఐసి లో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కాష్ మెడికల్ బెనిఫిట్స్ చెల్లించాలని ఎక్స్గ్రేషియాను  పెన్షనర్లందరికీ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఎం ఆదినారాయణమూర్తి ఆందోళన లక్ష్యాల్ని వివరిస్తూ మాట్లాడారు. పెన్షన్ అప్డేషన్, కాష్ మెడికల్ బెనిఫిట్, 1986కి ముందు రిటైర్ అయిన ఉద్యోగుల ఎక్స్గ్రేషియా పెంపుదల, ఎల్ఐసిలో నూతన ఉద్యోగుల రిక్రూట్మెంట్ వంటి డిమాండ్లు ఎల్ఐసి యాజమాన్యం గత కొన్నేళ్లుగా తాత్సారం చేస్తూ వస్తోందని అన్నారు.

ఏజెంట్లకు వ్యతిరేకంగా ఉన్న ఐఆర్డిఏ నిబంధనలను తొలగించాలని కోరారు. ఎల్ఐసిని నిర్వీర్యం చేసే చర్యలు ఏజెంట్ల కమిషన్ కుదింపు, పాలసీ సరెండర్ పీరియడ్ ఏడాదికి తగ్గింపు, ప్రాఫిట్ పార్టిసిపేటింగ్ పాలసీల కుదింపు వంటి చర్యల్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. సంఘీభావంగా ఐసిఈయు తరఫున జి శ్రీ రామమూర్తి ఎన్ ఎఫ్ ఐ ఎఫ్ డబ్ల్యూ తరఫున డోల తారక రామారావు మద్దతు ప్రకటించారు. కె. శ్రీనివాసు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వీజీకే మూర్తి ఎం ప్రభాకర్ రావు, బి శివాజీ, డి అచ్యుతరావు, ఐ వెంకటేశ్వరరావు కె. నారాయణ రావు, ఏ. కనకరాజు, ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️