షీలానగర్‌లో స్థలం కబ్జాపై ఆందోళన

Sep 30,2024 00:24 #andholana, #Sheelanagar place
sheela nagar andholana

 ప్రజాశక్తి -గాజువాక : షీలానగర్‌లో ప్రభుత్వ స్థలం కబ్జా పట్ల స్థానికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి మాట్లాడుతూ, 1981లో బిహెచ్‌పివి హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ద్వారా 328 వ్యక్తిగత స్థలాల కేటాయింపు జరిగిందన్నారు. ఆ సమయంలో పార్కులు, సామాజిక భవనాలు, ఇతర అవసరాల కోసం కొంత స్థలం కేటాయించినట్లు తెలిపారు. 1997 సంవత్సరంలో మున్సిపాలిటీకి వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని కేటాయించారని, ఆ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు విక్రయించారని, ట్యాంక్‌ నిర్మాణం కోసం ఉంచిత స్థలం అమ్మకం జరిగితే, భవిష్యత్తులో మరో ట్యాంక్‌ నిర్మాణం కోసం స్థలం లేదని, తక్షణమే ఆ స్థలాన్ని రక్షించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఉడా అధికారులు స్పందించి స్థలాన్ని కాపాడాలని కోరారు. స్థానిక కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి స్థలం వద్దకు వచ్చి ఆందోళనకు మద్దతు తెలియజేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో స్థానికులు జి.మణి, ఐ.గాంధీ, జి.సుబ్బరాజు, సత్యారావు, ఎం.వెంకటేశ్వరరావు, శరత్‌, కృష్ణారావు పాల్గొన్నారు.

➡️