ప్రజాశక్తి – చాపాడు తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, తగు న్యాయం చేయాలని నక్కలదిన్నె గ్రామంలో భర్త మృతదేహంతో అతని భార్య ఆందోళన చేసిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. నక్కలదిన్నె గ్రామంలో బుధవారం పంట పొలాల బావిలో పడి వెంకటయ్య (35) మృతి చెందిన సంఘటన తెలిసిందే. వెంకటయ్య భార్య యశోద, వారి బంధువులు మృతదేహంతో అదే గ్రామానికి చెందిన ప్రసాద్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చిన్న పెద్దయ్య సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. వెంకటయ్య మృతిపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టంలో పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని, అంతవరకు వేచి ఉండాలని ఆయన కోరారు. వెంకటయ్య కొన్నేళ్లుగా ప్రసాద్ వద్ద వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
