ప్రజాశక్తి – రాయచోటి టౌన్ కేరళ పట్ల వివక్ష చూపుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చర్యలు ఖండించాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మోడీ సర్కార్ కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు కల్పిం స్తున్నదని, చట్టపరంగా రావాల్సిన నిధులు విడుదల చేయలేదని అందుకు నిరస నగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేరళ ప్రభుత్వానికి సంఘీభావంగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి పి.శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.రామచంద్ర మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా బిజెపి యేతర ప్రభుత్వాల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ఇందులో ముఖ్యంగా కేరళలోని సిపిఎం నాయకత్వాన ఉన్న వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు అడ్డంకులు కలిపిస్తున్నదని పేర్కొన్నారు. చట్టపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకపోవడమే గాక గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని కేరళ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను తొక్కిపెడుతూ కేవలం సుప్రీం కోర్టు జోక్యంతో ఒత్తిడితో చేసుకుంటే అరకొర నిధులు ఇస్తున్నారని తెలిపారు. కేరళ లోని భారత పెట్రోలియం లాంటి భారీ పరిశ్రమను అమ్మకానికి సిద్దపడగా కేరళలో సంవత్సరం పాటు ఆందోళన చేస్తే కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. త్రివేండ్రం విమానాశ్రయాన్ని అదానికి అప్పజెప్పిందని తెలిపారు. కేరళలో తీవ్ర వర్షాల వలన వయనాడ్లో కొండ చరియలు విరిగి 400 మంది చనిపోవడమే గాక నాలుగు జిల్లాలు పూర్తిగా నీటి మట్టమయితే కేరళ ప్రభుత్వంతో పాటు దాతలు, ఇతర రాష్ట్రాల ప్రజల విరాళాలిచ్చి ఆదుకున్నారు తప్ప జాతీయ విపత్తుగా పరిగనించి కనీస సహకారం ఇవ్వలేదని తెలిపారు. మున్సిపల్ యూని యన్ జిల్లా అధ్యక్షులు బి.వి.రమణ, పట్టణ అధ్యక్షులు మద్దెల చెన్నయ్య మాట్లాడుతూ కేరళ ప్రభుత్వానికి పరిమిత వనరులే ఉన్నప్పటికీ కనీసవేతనం రోజుకు రూ.600 అమలుచేయడంలోనూ 30 రకాల వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు వేతనాల్తో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో విద్య వైద్యం ఆరోగ్యం లోటు లేకుండా కషి చేసిన కేరళను ఐక్యరాజ్యసమితి కొనియాడిందని తెలిపారు. అలాంటి కేరళను కేంద్రం నిదులివ్వకుండా అభివద్ధికి ఆటంకపరుస్తున్నందుకు దేశవ్యాప్తంగా కేరళ సంఘీభావ దినంగా బిజెపికి వ్యతిరేకంగా చేపట్టే నిరసనలు, ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగబసిరెడ్డి, సిఐటియు నాయకులు సిద్దిమల్లు, సిద్దయ్య, శ్రీను, నాగరాజు వడ్డెర సంఘం నాయకులు చల్లా రెడ్డెయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ,పెద్ద వెంకట రమణ పాల్గొన్నారు.
