బుచ్చయ్యపేట : రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్‌గా నియంతులైన టిడిపి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబును తెలుగు మహిళ జిల్లా నాయకులు ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, నర్సీపట్నం జడ్పిటిసి ఎస్. రమణమ్మ, మాజీ ఎంపిపి పోతల రమణమ్మ, అమర పిన్ని వరలక్ష్మి ఉన్నారు.
చోడవరం : రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా నియమకమైన బత్తుల తాతయ్యబాబును జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎస్‌ఎన్ రాజు ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అలం అప్పారావు పట్టణ మహిళా అధ్యక్షురాలు నర్వ సరోజ , గూడూరు ములు నాయుడు తెలకపల్లి మహేష్, చెప్పకట్ట శ్రీను, కర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.