ఇంటర్‌ విద్యార్థులకు అభినందనలు

 ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలోని అమృత విద్యాసంస్థలను కంద ుకూరుకు చెందిన శ్రీ గాయత్రి విద్యాసంస్థలుగా మార్పులు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను. అధ్యాపకులను శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్‌ సిహెచ్‌. రామకష్ణారావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ అమృత విద్యాసంస్థలను శ్రీ గాయత్రి విద్యా సంస్థలుగా మార్పుచేసినట్లు తెలిపారు. 2025 ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో సీనియర్‌ ఇంటర్‌ ఎంపిసి విభాగం విద్యార్థి యాస్మిన్‌ 986 మార్కులు సాధించినట్లు తెలిపారు. గోపి జాహ్నవి 984 సిరిమల మైత్రి 981, శ్రీలక్ష్మీ 972, నాయుడు సాయి కళ్యాణి 968 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో షేక్‌ ఇషా హాకీ 984 రాయపు భాను శ్రీ 936 మార్కులు సాధించడం జరిగిందన్నారు జూనియర్‌ ఇంటర్‌ ఎంపిసి విభాగంలో చలంచర్ల మోహనశ్రీ, 462 షేక్‌ సలీమా 450, వాటుపల్లి కీర్తన 448, నక్కా పావని 441, మద్దెల అక్షయ 437, తన్నీరు జ్యోతి 430 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ సిఇసిలో యాకసిరి గ్రీష్మ 865, గొల్ల పోతు శ్రీలత 857 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌ వి. స్వాతి, ఉపాధ్యాయులు అర్రె బోయిన రాంబాబు, గోపి, నాగేంద్రరావు, సిహెచ్‌.సుధాకర్‌రావు పాల్గొన్నారు. 

➡️