శాలువా కప్పి అభినందిస్తున్న వ్యాపారులుఎంఎల్‌ఎ ‘కావ్య’కు అభినందనలుప్రజాశక్తి-కావలి:కావలి ఎమ్మెల్యేగా కావలి చరిత్రలో లేనటువంటి అఖండ మెజారిటీతో గెలిచిన కావ్య కృష్ణారెడ్డిని ఏల్చూరి రవి ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారులు మర్యాదపూర్వకం గా కలిసి దుస్సాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నవోదయ, శుభోదయ, వస్త్ర మార్కెట్ వ్యాపారులు ఏల్చూరి రవి, సురేంద్ర శ్రావణ్, నరసింహ, స్వామి ,ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సురేష్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, శ్రీకాంత్ దంపతులు పాల్గొన్నారు.
