రాహుల్‌ కుమార్‌కు సత్కారం

ప్రజాశక్తి-కనిగిరి ఏపీపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభను చాటిన వి రాహుల్‌ కుమార్‌ను గురువారం జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్‌ గయాజ్‌బాషా కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. కనిగిరి ప్రాంతానికి చెందిన రాహుల్‌ 504 ర్యాంకు సాధించి ఈ ప్రాంత యువతకు ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. రాహుల్‌ తల్లిదండ్రులు రత్నకుమార్‌, వయోలా రాణి ఇద్దరూ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కావటం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి రాహుల్‌ ఒక ఉదాహరణగా నిలిచారని, క్రమశిక్షణ గల విద్యార్థిగా నిరంతర అధ్యయనంతో తాను అనుకున్న లక్ష్యం సాధించారని, ఇందుకు వారి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించారని అన్నారు. ఆయన వెంట గయాజ్‌ కుమారులు షేక్‌ సిరాజ్‌బాషా, షేక్‌ ఫరూక్‌ బాషా ఉన్నారు.

➡️