ప్రజాశక్తి -భీమునిపట్నం : టెన్త్ పరీక్షా ఫలితాల్లో 595 మార్కులు సాధించిన రిషితశ్రీని స్థానిక సాగర్ అసోసియేషన్ ఆఫ్ వాకర్స్ సంస్థ ప్రతినిధులు మంగళవారం అభినందించారు. భీమిలిలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఆధ్వర్యాన ఆమెకు రూ.25 వేలు బహుమతిగా అందజేశారు. సంస్థ సభ్యులు, మాజీ కౌన్సిలర్ మైలపల్లి లక్ష్మణరావు కుమార్తె రిషితశ్రీ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని సంస్థ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కె.మల్లికార్జునరావు, కార్యదర్శి అవనాపు అప్పలనాయుడు, కోశాధికారి బొండా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.రిషితశ్రీకి రూ.25 వేలు బహుమతి ఇస్తున్న సంస్థ ప్రతినిధులు
