సంధ్యారాణికి అభినందనల వెల్లువ

Jun 8,2024 21:11

ప్రజాశక్తి – సాలూరు: ఎమ్మెల్యే సంధ్యారాణికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ఆమె నివాసానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తాకిడి పెరుగుతోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వస్తున్న నాయకులు, కార్యకర్తలతో నివాసం సందడిగా కనిపిస్తోంది. శనివారం మండల పార్టీ అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, మండల నాయకులు భాస్కరరావు, మత్స శ్యామ్‌, యుగంధర్‌, పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు ఆమెను అభినందించారు. పట్టణ సిఐ సిహెచ్‌.వాసునాయుడు, రూరల్‌ సిఐ బాలకృష్ణ ఎస్‌ఐలు ఆమె నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాచిపెంట, సాలూరు మండలాల యుటిఎఫ్‌ నాయకులు ఎమ్మెల్యేకు డైరీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో యుటిఎఫ్‌ నాయకులు ఎ.గణేష్‌, ఎ.రాజమణి, తదితరులు ఉన్నారు.మంత్రి పదవిపై ఆశాభావంరాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యే సంధ్యారాణికి చోటు దక్కుతుందని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సంధ్యారాణి సీనియర్‌ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. రెండు దశాబ్దాల తర్వాత నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేయడంలో సంధ్యారాణి కృషికి గుర్తింపుగా మంత్రి పదవి ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

➡️