ప్రజాశక్తి-గిద్దలూరు : ఇంటర్ మొదటి సంవత్సరంలో 466 మార్కులతో స్టేట్ 2వ ర్యాంక్ సాధించి తన ప్రతిభని రాష్ట్ర స్థాయిలో నిరూపించిన తమ పూర్వ విద్యార్థిని షేక్ ఆశ్రిఫాను ఇండో స్కూల్ యాజమాన్యం అభినందించింది. అలాగే 457 మార్కులు సాధించిన అర్చన, స్పందనలను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జాడి శ్వేత మాట్లాడుతూ గత సంవత్సరం పదో తరగతి పరీక్షలలో అద్భుత ప్రతిభను చూపి తమ పాఠశాలకు మంచిపేరు తీసుకువచ్చిన ఆశ్రిఫా, ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో తను చదువుతున్న కాలేజీతో పాటు గిద్దలూరుకు కూడా మంచిపేరును తీసుకువచ్చినందుకు అభినందించారు. వచ్చే సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్‌లో స్టేట్ ఫస్ట్ సాధించి గిద్దలూరు స్థాయిని పెంచాలని డైరెక్టర్ చైతన్య ఆకాంక్షించారు. తనను ప్రోత్సహించిన విద్యా సంస్థలకు, తల్లిదండ్రులు, గురువులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని షేక్ అశ్రిఫా తెలిపారు.
