కష్టబడి పనిచేసిన కార్యకర్తలకు అభినందన

మాదంశెట్టి నీలబాబు

ప్రజాశక్తి-అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికల్లో కష్టబడి పనిచేసి, 84వ వార్డులో కూటమి అభ్యర్థులకు మంచిమెజారిటీ వచ్చేలా కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలనుఅభినందించారు. 84వ వారు చినరాజుపేటలో కార్పొరేటర్‌ మాదంశెట్టి చిన్నతలి, టిడిపి వార్డు ఇన్‌ఛార్జి మాదంశెట్టి నీలబాబు ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికల్లో సేన అభ్యర్థి కొణతాల రామకష్ణ బిజెపి పార్లమెంట్‌ అభ్యర్థి సీఎం రమేష్‌ విజయానికి కష్టపడి పని చేసిన నాయకులను కార్యకర్తలను అభినందించారు. పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కుప్పిలి జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందనసభలో నీలబాబు మాట్లాడుతూ 84 వ వార్డు పరిధిలోని 18 బూత్‌లలో జనసేన, బిజెపి అభ్యర్థులకు అన్నిరౌండ్లలోనూ మంచి ఓట్ల ఆధిక్యత వచ్చిందని, వార్డు మొత్తంగా 6080 ఓట్లు మెజారిటీ సాధించామని నీలబాబు అన్నారు. కూటమి గెలుపులో టిడిపి నాయకులు కార్యకర్తలు, జనసేన బిజెపి సమిష్టి నాయకత్వంతో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ, బోడి వెంకటరావు, తలారి ప్రసాదు, కోట్ని రాంబాబు, సుగ్గు రామారావు, ఏనుగుల శ్రీను, రోకళ్ళ తాతారావు, అలంక భోగేశు, బత్తుల శ్రీనివాసరావు, పొండూరి సత్యనారాయణ పాల్గొన్నారు.

కార్యకర్తలను అభినందిస్తున్న నీలబాబు

➡️