ఆదర్శ ఉద్యోగులకు అభినందన

ప్రజాశక్తి-పీలేరు పీలేరు ఆర్‌టిసి ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభ నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఆర్‌టిసి గ్యారేజీలో జరిగిన కార్యక్రమంలో డిపో మేనేజర్‌ నిర్మల 2025 మార్చి నెలలో అత్యధిక కెయంపియల్‌ సాధించి తమ ప్రతిభచాటుకున్నన్న డ్రైవర్లు ఎంఆర్‌ మూర్తికి రూ.500లు, మరో డ్రైవర్‌ వి. సిద్దయ్యకు రూ.300లు బహుమతిగా చెక్కులను అందించారు. ఎంఆర్‌ మూర్తి 147 లీటర్ల డీజిల్‌ పొదుపు చేసి ప్రథమ బహుమతిని, 123 లీటర్ల డీజిల్‌ పొదుపు చేసిన మరో డ్రైవర్‌ వి.సిద్దయ్య ద్వితీయ బహుమతిని అందుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లను ఉద్దేశించి డిఎం మాట్లాడుతూ ప్రమాద రహిత, ఇంధన పొదుపు, ఆదాయ అభివద్ధికి కషి చేయాలని సూచించారు. అలాగే అత్యధిక ఈపీకే సాధించి డిపో ఆర్థిక అభివద్ధికి ప్రతి ఉద్యోగి సహకరించాలని డిఎం కోరారు. గ్యారేజ్‌ సిబ్బందికి ఫ్రీ బ్రేక్‌డౌన్‌ గురించి తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో గ్యారేజ్‌ ఇన్‌ఛార్జి, సూపర్‌ వైజర్స్‌, అసోసియేషన్‌ లీడర్స్‌, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.

➡️