ఎంఎల్‌ఎలకు అభినందనలు

Jun 8,2024 22:02
ఎంఎల్‌ఎలకు అభినందనలు

ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డిని సత్కరిస్తున్న దృశ్యం
ఎంఎల్‌ఎలకు అభినందనలు
ప్రజాశక్తి-నెల్లూరుఎన్నికల్లో గెలుపొందిన పలువురు ఎంఎల్‌ఎలను కమ్యూనిటి పారామెడిక్స్‌ అండ్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. శనివారం కమ్యూనిటీ పారామెడిక్స్‌ అండ్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శాఖవరపు వేణుగోపాల్‌, గోరంట్ల శేషయ్య ఆధ్వర్యంలో రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోవూరు ఎంఎల్‌ఎ వేమిరెడ్డిప్రశాంత్‌రెడ్డిలను వారి వారి నివాసాలల్లో కలిసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పీ.హెచ్‌.పి నాయకులు దేవరకొండ శ్రీనివాసులు, నరసాపురం ప్రసాదు, చిట్లూరి వీరయ్య, ఉప్పలపాటి రామదాసు పాల్గొన్నారు.

➡️