విద్యార్థికి అభినందనలు

ప్రజాశక్తి-పొదిలి: ఇటీవల ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలలో స్థానిక వీరిశెట్టి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించి రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించిన ఎక్సైజ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న షేక్‌ మస్తాన్‌ భాష కుమారుడు హబీబ్‌ అహ్మద్‌ భాషను ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అరుణ అభినందించారు. విద్యార్థికి మిఠాయిలు తినిపించారు. కషి పట్టుదలతో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ వి.సైమన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️