ప్రజాశక్తి -వేటపాలెం : స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి షటిల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో విన్నర్‌గా నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకష్ణారావు, కళాశాల కరస్పాండెంట్ ఎస్.లక్ష్మణరావు సోమవారం తెలిపారు. ఒంగోలులోని డిఎ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2024 ఇటీవల నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపి విశాఖ పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విన్నర్స్‌గా నిలిచినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు కె. జగదీశ్ బాబు తెలిపారు. ద్వితీయ సంవత్సరం డిప్లమా ఇసిఇ విభాగానికి చెందిన కావటి రిషి, ఇఇఇ విభాగానికి చెందిన ముక్కల సూర్య కిరణ్ ఈ పోటీల్లో పాల్గొని రాష్ట్ర జట్టు విజయానికి కృషి చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాస రావు తెలిపారు. విజేతలను సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డిప్యూటీ డైరక్టర్ కె. విజయభాస్కర రెడ్డి, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి. రమణమూర్తి వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
