విద్యార్థులకు అభినందనలు

Jun 9,2024 21:22
విద్యార్థులకు అభినందనలు

విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం
విద్యార్థులకు అభినందనలు
ప్రజాశక్తి-నెల్లూరుఇటీవల ప్రకటించిన పది పరీక్షా ఫలితాల్లో ప్రతిభను కనపరిచిన జనహిత వాత్సల్య ఆశ్రమ విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నగరంలోని వనంతోపు సెంటర్‌ కొండాయపాలెం జనహిత వాత్సల్య ఆశ్రమంలో సేవా టీం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి చెందిన విద్యార్ధులు పది పరీక్షలల్లో మంచి మార్కులు సాధించిన 18 మంది విద్యార్థినీ విద్యార్థులను అభినందించడంతోపాటు ఒక్కొక్క విద్యార్థికి రూ.1000/-లు వంతున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఏపీ హంస ( హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌) జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్‌ రావు మాట్లాడుతూ 10 మంది విద్యార్థులకు సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ అధికారి బాలకష్ణారెడ్డి, ఇద్దరు విద్యార్థులకు సబ్‌ ట్రెజరీ అధికారి రమణ రావు, ఒక విద్యార్థికి కమల్‌ కిరణ్‌ ఎఓ , ఇద్దరు విద్యార్థులకు పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌ సక్కుబాయమ్మ, మరో ముగ్గురు విద్యార్థులకు హెల్త్‌ సూపర్వైజర్‌ వసంత నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చివరగా ఆశ్రమ పిల్లలందరికీ స్నాక్స్‌ కల్పం శ్రీనివాసులు అందజేశారు. శ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ తల్లిదండ్రు లేని బిడ్డలను ప్రోత్సహిస్తూ వాళ్ళ విద్యాభివద్ధిలో సహాయం చేస్తున్న దాతలందరికీ అభనందనలు తెలిపారు. చివరగాగూడూరు సబ్‌ ట్రెజరీ అధికారి ఎస్కే మక్సుద్‌ రు. 5000లు విలువ చేసే ప్రొవిజన్స్‌ , రూ.2000లు విలువ చేసే స్నాక్స్‌ ను ఫార్మసీ ఆఫీసర్‌ బాను రేఖ ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. దాతలు మాట్లాడుతూ వాత్సల్య ఆశ్రమం భారతీయ విద్యా వికాస్‌ స్కూల్‌ అధ్యాపకులను ఆశ్రమ నిర్వాహకులు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సాంబశివరావు సేవలు కొనియాడటంతో పాటు వారిని అభి నం దించారు.సేవా టీం నిర్వాహకులు పరిమళ, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ నాయకులు ఖాదర్‌ మస్తాన్‌, ఆశ్రమ చార్టెడ్‌ అకౌంటెంట్‌ దుర్గాప్రసాద్‌, సాఫ్టువేర్‌ ఇంజనీర్‌ వెంకట సాయి కళ్యాణ్‌ పాల్గొన్నారు.

➡️