ప్రజాశక్తి-టంగుటూరు : పుదుచ్చేరిలో ఈనెల 4న నిర్వహించిన జాతీయస్థాయి 3వ ఫ్లోర్ కర్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో టంగుటూరు భాస్యం స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపి పతకాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఎస్‌కె.నౌషాద్ బేగం ఉమెన్స్ మిక్స్‌డ్‌లో సిల్వర్ మెడల్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్, టీంలో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది. పి.సంపత్ కుమార్ మిక్స్‌డ్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. పుదుచ్చేరి సిఎం ఎన్. రంగస్వామి, పుదుచ్చేరి కీడ్రా శాఖ మంత్రి నమశ్శివాయ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన భాష్యం స్కూల్ విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో రాణించడం ముఖ్యమని తెలిపారు. అనంతరం జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల ప్రకాశం జోనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి. శ్రీకష్ణ గణేష్, టంగుటూరు బ్రాంచ్ ప్రిన్సిపల్ ఎస్‌కె. ఖాదర్ భాషా, ఉపాధ్యాయులు అభినందించారు.
