రాష్ట్ర క్రీడా పోటీల విజేతలకు అభినందనలు

Mar 25,2025 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  గుంటూరులో ఈనెల 19,20,21 తేదీల్లో జరిగిన మహిళా క్రీడా, కల్చరల్‌ ఇంటర్‌ సర్కిల్‌ టోర్నీలో విజయనగరం క్రీడాకారులు విజయం సాధించారు. కల్చరల్‌ ప్రోగ్రాంలో మోనో యాక్షన్‌లో ఎం.నిర్మలమూర్తి తృతీయస్థానం, లైట్‌ మ్యూజిక్‌ సాంగ్స్‌లో ఎ.రామకృష్ణ ప్రథమ స్థానం, ఫోక్‌ సాంగ్‌లో డి.చిరంజీవులు కన్సులేషన్‌, , ఇనిస్ట్రిమెంట్‌లో అప్పారావు పతకాలు సాధించారు. మహిళల విభాగంలో.. టెన్నీ కాయిట్‌ డబుల్స్‌ లో ఎస్‌వై బాలా కుమారి, బి.లక్ష్మి, ద్వితీయ స్థానం సాధించారు. లాంగ్‌ జంప్‌లో కె.నవ్య, 100 మీటర్ల పరుగు పందెంలో బి.రోజా తృతీయ స్థానం సాధించారు. మొత్తంగా 9 కప్‌ లు సాధించారు. పతకాలు సాధించిన ఉద్యోగులను ట్రాన్స్‌కో ఎస్‌ఇ ఎం.లక్ష్మణరావు, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ పి.త్రినాధరావు, జనరల్‌ సెక్రటరీ వి. మోహన్‌ బాబు, గేమ్స్‌ సెక్రటరీ.. కల్చర్‌ సెక్రటరీ , ఎన్‌. గణేష్‌ రావు తదితరులు అభినందించారు. విద్యుత్‌ అధికారులు అభినం దించారు.

➡️