ఇస్తిమా ఏర్పాట్లు పరిశీలన

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ : డిసెంబర్‌ 7, 8వ తేదీలలో రాయచోటి పట్టణంలో నిర్వ హించబోయే ఇస్తిమా కార్యక్రమానికి సంబంధించి ముస్లిమ్‌ సోదరులు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాష, కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులతో కలసి వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. ఇస్తిమా నిర్వహణా ఏర్పాట్లుపై మత గురువులుతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు గొర్లముదివీడు క్రాస్‌ సమీపంలో అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించే ఇస్తిమా కార్యక్రమానికి దాదాపు ఒకటన్నర లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తుండడం అభినందనీయమని చెప్పారు. క్రమశిక్షణ, శ్రమతో ఏర్పాట్లు చేయడంతో పాటు ఆరోగ్య శిబిరాలు, ఎక్కడా ఎటువంటి లోటు పాట్లు, కొరత లేకుండా సమన్వయంతో కార్యక్రమాలు చేస్తుండడం హర్షదాయక మన్నారు. ప్రపంచ మానవాళికి శాంతి కలగాలని పేర్కొన్నారు. ఇస్తిమా కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ ఖాన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొలిమి హారూన్‌బాష, కౌన్సిలర్లు కొలిమి చాన్‌ బాష, గౌస్‌ ఖాన్‌, అల్తాఫ్‌, రౌనక్‌, వండాడి సర్పంచ్‌ ముసల్‌ రెడ్డి, జాకీర్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, అన్నా సలీం, మాజీ కో-ఆప్షన్‌ జాఫర్‌ అలీ ఖాన్‌, జిఎండి ఇర్షాద్‌, నవాజ్‌, యూసుఫ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

➡️