గుండెపోటుతో కానిస్టేబుల్‌ ఆదిత్య ప్రవీణ్‌ మృతి

Feb 15,2025 17:47 #Constable, #died of heart attack

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : గుండెపోటుతో కానిస్టేబుల్‌ వానపల్లి.ఆదిత్య ప్రవీణ్‌ (37)శుక్రవారం మృతి చెందారు. ఉన్నతిధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం ఆదిత్య ప్రవీణ్‌ గత 13 సంవత్సరాలుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన 108లో రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్‌ హాస్పటల్‌ తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ.. మృతి చెందారు. ప్రవీణ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మతదేహం వద్ద పిల్లలు ఏడుస్తుడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. డిపార్ట్మెంట్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడని నీతి, నిజాయితీలు కలిగి నిబద్ధత ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడని అతి చిన్న వయసులో ప్రవీణ్‌ మమ్మల్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని తోటి సిబ్బంది పేర్కొన్నారు. పోలీస్‌ డిపార్ట్మెంట్‌ ఎప్పుడు ప్రవీణ్‌ కుటుంబానికి అండగా ఉంటుందని పోలీస్‌ డిపార్ట్మెంట్‌ ఉన్నత ఉద్యోగి తెలిపారు. ధవలేశ్వరంలోని క్రిస్టియన్‌ బరియల్‌ గ్రౌండ్‌లో పోలీసులు గౌరవ వందనంతో ప్రవీణ్‌ అంత్యక్రియలు జరిగాయి.

➡️