భారత రాజ్యాంగం గొప్పది : మంత్రి

ప్రజాశక్తి-టంగుటూరు : ప్రపంచ దేశాలలో కెల్లా భారత దేశ రాజ్యాంగం గొప్పదని, రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన దేశ రక్షణ కోసం రచించిన అతి పెద్ద గ్రంథం రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగ రచన సంఘానికి అధ్యక్షుడిగా డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ వ్యవహరించారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు. గిద్దలూరు రూరల్‌ : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ చెన్నారావు, కార్యాలయ ఎఒ విజయ కుమారి,డిపిఆర్‌సి సురేష్‌, స్వచ్ఛభారత్‌ ఎంఆర్‌సి బాబూరావు, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : మండల పరిషత్‌ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపిడిఒ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ చిరస్మరణీయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ సిబ్బంది , ఉపాధిహామీ కార్యాలయ సిబ్బంది, ఒమ్మెవరం సర్పంచి పాలపర్తి బాలకోటి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్‌ఛార్జి విజేష్‌రాజ్‌ ఆద్వర్యంలో ఉప్పుగుండూరులో కొవ్వొతులతో ర్యాలీ నిర్వహించారు. నాగులుప్పలపాడు గ్రంథాలయంలో గ్రంథపాలకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు. కొత్తట్నం : కొత్తపట్నం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయుడు నాగమల్లేశ్వరరావును సన్మానించారు. వ్యాసరచన, వ్యక్తిత్వ, క్విజ్‌ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మన్నం శ్రీదేవి, స్టాఫ్‌ సెక్రటరీ హరిబాబు, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా ట్రైనింగ్‌ కమిషనర్‌ కొణిజేటి వెంకట శేషారావు, జిల్లా కోశాధికారి వెంకట్రావు, చెక్కా కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాచర్ల : మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో ఎంపిడిఒ సూరె వెంకటరామిరెడ్డి, మండల విస్తరణాధికారి, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొండపి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రామాంజనేయులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిధిలోని ఉప్పలపాడు హైస్కూల్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు సురేఖ, రామారావు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శంకర్‌ రావు, స్కూల్‌ పాఠశాల కమిటీ చైర్మన్‌, సభ్యులు ప్రధానోపాధ్యాయుడు వి.సుసన్నకుమార్‌ పాల్గొన్నారు. శింగరాయకొండ : 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి శింగరాయకొండ ఎస్‌ఐ మహేంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పులగర కష్ణయ్య, చొప్పర వెంకన్న, ఆరేటి లక్ష్మి నారాయణ, చొప్పర నరసింహం, అల్లు వెంకటేశ్వర్లు, బిళ్లా కోటేశ్వరావు, మిడసల కోటయ్య, బల్లికూర సుబ్బారావు, రాచూరి కొండయ్య, ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్‌ సుల్తాన్‌, తిరుపతిస్వామి, ఉజ్వల్‌, సుదర్శిరాజు, పెయ్యల సురేష్‌ పాల్గొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ జయమణి,ఎఒ కష్ణారావు, ఎపిఒ సుధాకర్‌, ఎపిఎం భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు టి.రవి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. యర్రగొండపాలెం : 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు బాల కిషోర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీ ప్రసాదు, విఆర్‌ఒలు నాసర్‌ వలి, యల్లయ్య, రాంబాబు, ఓబయ్య, దానం, డేవిడ్‌, ఖాదర్‌ వలి,, విఆర్‌ఎ బుజ్జి, బ్రహ్మయ్య, పాల్గొన్నారు.మద్దిపాడు : మండల పరిషత్‌ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి, జాతీయ నాయకుల చిత్ర పటాలకు ఎంపిపి వాకా అరుణ కోటి రెడ్డి, ఎంపిడిఒ జ్యోతి, తహశీల్దారు సుజన్‌ కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ ఆంజనేయులు, శ్రీనివాసరావు, ఇఒపిఆర్‌డి రఘుబాబు, అంగన్‌వాడీలు,ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

➡️