ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజ్యాంగ ఉల్లంఘన జరుగు తుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ వారి హక్కులను కాలరాస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవల ఎన్‌టిఆర్ విగ్రహానికి ఉరి వేసుకొనే ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వం క్యాబినెట్‌లో ఐదుగురు దళితులకు స్థానం కల్పిస్తే కూటమి ప్రభుత్వం ఇద్దరికి మాత్రమే క్యాబినెట్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ఆయన ప్రశ్నించారు. సాధారణ దళిత కుటుంబానికి చెందిన తాను ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే సాధ్యమైందాన్నరు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, జడ్‌పిటిసి చేదురి విజయభాస్కర్, ఎంపిపి దొంతా కిరణ్ గౌడ్, సర్పంచి అరుణ బాయి, కన్వీనర్ కొప్పర్తి ఓబుల్ రెడ్డి, వైసిపి నాయకులు మార్తాల సుబ్బారెడ్డి, మూడమంచు బాల గురవయ్య, ముసలారెడ్డి, ఆవుల కోటిరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, తోమాటి రాంబాబు, బొమ్మాజీ బాల చెన్నయ్య, మైనార్టీ నాయకులు జబీబుల్లా, షేక్ వలి, రాములు నాయక్, పాల్గొన్నారు.. శింగరాయకొండ : కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తుందని వైసిపి నాయకులు విమర్శించారు. వైసిపి అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరక 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక రైల్వే రోడ్డు వద్ద ఉన్న బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలులు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసిపి వైద్యవిభాగం రాజ మాజీ అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తుందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైసిపి శ్రేణులపైదాడులు, అక్రమ కేసులతో పాటు ప్రశ్నించే గొంతులను నొక్కడంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు, వైస్ ఎంపిపి సామంతుల రవికుమార్‌రెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షుడు షేక్ పటేల్, షేక్ సుల్తాన్, సవలం కోటేశ్వరరావు, యనమల మాధవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాపూరి ప్రభావతి. వైసిపి పట్టణ అధ్యక్షుడు షేక్ కరీం, పఠాన్, రియాజ్, చిమటా శ్రీనివాసరావు, షేక్ అబ్దుల్లా చొప్పర వెంకన్న, వైసిపి నాయకులు పాల్గొన్నారు.