ప్రజాశక్తి – కురుపాం : స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన జరగాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత సమయానికి ముందే పూర్తికావాలని సూచించారు. ఈ పర్యటనలో ట్రైబల్ వెల్ఫేర్ డిడి కృష్ణవేణి, డిఇఇ (భద్రగిరి), ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.