ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : ముగింపు స్థాయికి వచ్చిన ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈమని పేరయ్య ఆదేశించారు. హౌసింగ్ ఈఈలు, డిఈఈలు, , ఏఈఈలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించి, 100 రోజులలో పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ మాట్లాడుతూ రూఫ్ లెవల్ కు వచ్చిన 3498 ఇళ్ల నిర్మాణాలను లబ్దిదారులు త్వరగా పూర్తి చేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు కచ్చితంగా ఉపాధి హామీ పథకంలో 90 రోజుల పాటు పనిదినాల ప్రయోజనం పొందేలా చూడాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు కూడా త్వరగా జనరేట్ అయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో ఈఈలు శ్రీనివాసప్రసాద్, దశరథిశర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
