ప్రజాశక్తి….విజయనగరం టౌన్ : జె ఎన్ టి యు జంక్షన్ నుంచి జె ఎన్ టి యు కాలేజీ వరకు జరుగుతున్న 100 అడుగులు రోడ్డు విస్తరణకు సహకరించాలని నిర్వాసితులను కోరారు.శనివారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం లో నిర్వాసితులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ 37 మంది ఆస్తులు విషయంలో భూములు కోల్పోయిన ,భవనాలు కోల్పోయిన టి డి అర్ రూపంలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఎవ్వరికీ ఎటువంటి నష్టం జరగకుండా మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందన్నారు. అనంతరం నిర్వాసితులు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ స్థాయిలో మా సిబ్బంది రావడం జరుగుతుంది,దగ్గర ఉండి అన్ని కొలతలు తీసుకొని ఎటువంటి ఇబ్బందీ లేకుండా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు.అనంతరం.వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.సదస్సులో వి ఎం ఆర్ డి ఎ ప్రణాళిక అధికారులు పి.నాయుడు,బి.నిర్మల, టౌన్ సర్వేయర్ సింహాచలం, మండల సర్వేయర్ అప్పలనాయుడు ,నిర్వాసితులు పాల్గొన్నారు.