సమ్మర్‌ లో కూల్‌ ..కూల్‌ ..

సమ్మర్‌ లో కూల్‌ ..కూల్‌

వేసవి తాపం నుంచి ఉపశమనం

ప్రజాశక్తి-నక్కపల్లి: వేసవి తాపానికి అల్లాడుతున్న జనం వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.గురువారం తెల్లవారుజాము నుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని కొద్దిపాటి వర్షం కురిసింది .దీంతో రోజంతా చల్లబడింది. రెండు నెలల నుంచి భానుడు నిప్పులు గక్కడంతో ఉష్ణతాపానికి ప్రజలు విలవిలలాడారు. గురువారం రోజంతా ఆకాశం మేఘావతమై ,చల్లటి గాలులు వీస్తూ,చిరుజల్లులు కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడడంతో ప్రజలు సేద తీరారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఉపశమనం పొందారు. తెల్లవారుజామున ఆకాశంలో చీకటి కమ్ముకుని వర్షం కురవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు.

వర్షం కురుస్తున్న సమయంలో లైట్లు వేసుకుని వాహనాల రాకపోకలు

➡️