మండుటెండలో… ఉపాధి హామీ కూలీలకు కూలింగ్‌ నీరు

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కసింకోట మండలం పరవాడ పాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్‌ బలిజిమంగ ముసలినాయడు ఆర్థిక సహాయం తో ఉపాధి కూలీలకు వేసవి దృష్టిలో పెట్టుకొని రోజుకు 120 లీటర్లు కూలింగ్‌ వాటర్‌ అందించేందుకు మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎండలు దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు శాసనసభ్యులు కొణ తాల రామకృష్ణ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు ఎండలో ఉపాధి కూలీలకు దాహర్తి తీర్చేందుకు ఉపయోగపడేలాగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఈ కార్యక్రమంలో కూటిమి నాయకులు గొంతిని గంగాధర్‌ రావు కోనేటి శివ గణేష్‌ ఉపాధి కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️