డ్రోన్ల వినియోగంలో సహకరించాలి

Apr 11,2025 20:45

సెంచూరియన్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజుతో కలెక్టర్‌ భేటి

ప్రజాశక్తి-నెల్లిమర్ల :  వ్యవసాయం, ఉద్యాన వనాల అభివృద్ధిలో డ్రోన్ల వినియోగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోరారు. శుక్రవారం సెంచూరియన్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు కలెక్టర్‌తో భేటి అయ్యారు. సెంచూరియన్‌ యూనివర్సిటీలో చేపడుతున్న కోర్సుల వివరాలను, స్కిల్‌ డెవలప్మెంట్‌ శిక్షణ గురించి ఛాన్సలర్‌ కలెక్టర్‌ కు వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో అమలు చేస్తోన్న కోర్సులు , నైపుణ్య శిక్షణలు, సీడాప్‌ ఒప్పందం గురించి వివరించారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌, పారామెడికల్‌, అగ్రికల్చర్‌, మేనేజ్మెంట్‌ కోర్సులు నిర్వహిస్తొన్నమని వాటితోపాటు యువతకు శిక్షణనిచ్చేందుకు అన్ని రకాల నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ప్రశాంత కుమార్‌ మహంతి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పల్లవి మాట్లాడుతూ త్వరలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా యువతకు నైపుణ్య శిక్షణ కోర్సులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. డ్రోన్లతో వ్యవసాయం ఇతర రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ స్పందిస్తూ తాను త్వరలో విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. వ్యవసాయం లో, ప్రస్తుతం మామిడి పంట ఉన్నందున తెగుళ్లు నివారణ కు డ్రోన్ల ద్వారా కషి చేయాలని కోరారు. అనంతరం డిఆర్‌ఓ శ్రీనివాస మూర్తిని కలిశారు

➡️