ప్రజాశక్తి- రాయచోటి అన్నమయ్య జిల్లా అభివద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పనిచేయాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు, జిల్లా అభివద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ పి.వి.మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లో పిజిఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వ ర్యంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమా వేశం నిర్వహించారు. సమావేశానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట, తంబళ్లపల్లె శాసనసభ్యులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ద్వారక నాథరెడ్డి, చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప జడ్‌పి చైర్మన్లు శ్రీనివాసులు, శారద హాజర య్యారు. సమావేశ ప్రారంభంలో కలెక్టర్ ఎంపీకి, సభ్యులకు సాదరంగా ఆహ్వా నం పలికారు. ముందుగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా సమా వేశం నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి అనేది ముఖ్య ఉద్దేశమన్నారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపల్ బాడీ స్థానిక సంస్థలలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా జిల్లా అభివద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ కషి చేస్తుందని తెలిపారు. అనంతరం డ్వామా, పంచాయతీరాజ్, గహ నిర్మాణం, జడ్‌పికి సంబంధించి జాతీయ రూబన్ పొజిషన్, గనులు భూగర్భం, గ్రామీణ నీటిపారుదల, వైద్యం, ఆరోగ్యం తదితర శాఖల వారీగా చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పరిష్కారానికి కషి చేయాలని చెప్పారు. ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఉపయోగపడే పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజత కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అదనంగా నిధులు అవసరమైతే కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి వీలుంటుందని, అందుకు తాము కూడా కషి చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక ఎన్‌హెచ్ రోడ్లు, రోడ్లు రాజంపేట పార్లమెంటు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నాయని, జల్‌జీవన్ మిషన్‌లో 15 శాతం ఎస్సీలకు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని రాజంపేట పార్లమెంట్ పరిధిలో అభివద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ సభ్యులు సమావేశంలో లేవనెత్తిన అంశాలన్నిటిని నోట్ చేసుకున్నామని తెలిపారు. తంబళ్లపల్లిలో పోస్టుమార్టం, పీలేరులో 52 పడకల ఆసుపత్రిలో వైద్యులు అందుబాటు, ట్రామాకేర్ సౌకర్యం, శానిటేషన్ వర్కర్లు, 15 ఆర్థిక సంఘం నిధులకు పంచాయతీ కార్యదర్శుల సహకారం, జడ్‌పి నుంచి అనుమతులు ఇచ్చిన పనులను అమలు చేయడం వంటి వాటిపై దష్టి కేంద్రీకరించి సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని చెప్పారు. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ఉపయోగపడే పనులను ఎంపీ నిధుల కింద ప్రతిపాదించినప్పుడు అవసరమైన అనుమతులను సత్వరం పొందేలా అధికారులు కషి చేయాలన్నారు. తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ గహ నిర్మాణానికి సంబంధించి 90 మ్యాన్డెస్ నిధులు మధ్యలో దళారులు తీసుకోకుండా లబ్ధిదారుకు బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ మండలాలు, గ్రామాల్లో పంచాయతీ మున్సిపల్ మండల తీర్మానం మేరకు పనులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు, నర్సులు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిత్తూరు జడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ గ్రామ సభల్లో ప్రతిపాదించిన సిసి రోడ్లు, కాలువ నిర్మాణాలకు సంబంధించి ఎక్కడెక్కడ పనులు చేపట్టిన వివరాలను ప్రజాప్రతినిధులకు అందించాలని కోరారు. అంతకుముందు సమావేశం ప్రారంభంలో జిల్లాలో అమలవుతున్న పథకాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో జడ్‌పి సిఇఒ ఓబులమ్మ వివరించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, జడ్‌పిటిసిలు పాల్గొన్నారు.