ఏరూరు గ్రామంలో కార్డెన్ సెర్చ్

May 28,2024 17:09 #election results, #Kurnool, #police, #SI

ప్రజాశక్తి – చిప్పగిర : ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామాలలో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ పల గ్రామాల ప్రజలకు హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని ఏరూరు గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహమ్మద్ రిజ్వాన్ ఆధ్వర్యంలో అలహరి వి ఎస్ ఐ నరేంద్ర, ఆలూరు ఎస్సై ఓబులేసు, హోల్గొంద ఎస్సై పెద్దయ్య నాయుడుతో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అసాంఘిక సంఘటనలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్తవారు అనుమానితులు అయితే మాకు సమాచారం ఇవ్వాలన్నారు. గతంలో కేసులు ఉన్న వారి ఇండ్లలో కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. ఫలితాలు వచ్చిన రెండు రోజుల వరకు గ్రామాలలో ప్రత్యేక నిఘ పెట్టామన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని కోరారు. ఏఎస్ఐ నజీర్ అహ్మద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️