టిడిపికి కి ఓటేసి భూమన కాళ్లు పట్టుకున్న కార్పొరేటర్లు

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక తర్వాత ఆసక్తికర పరిణామం జరిగింది. టిడిపి అభ్యర్థి మునికృష్ణకు మద్దతు పలికిన కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి వెళ్లారు. ‘మాకు బతకాలని లేదు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే ఓట్లు వేశాం’ అంటూ కార్పొరేటర్లు కలిసి భూమన కాళ్లు పట్టుకున్నారు. అనీష్‌, మోహన్‌ యాదవ్‌, అనిల్‌, అమర్నాథ్‌ రెడ్డి అనే కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేశారంటూ వారిని భూమన మీడియా ముందు ప్రవేశపెట్టారు.

➡️