భోగిమంటలను వేస్తున్న కరస్పాండెంట్, డైరెక్టర్

Jan 10,2025 16:43

ప్రజాశక్తి – అవుకు (నంద్యాల) : అవుకు పట్టణంలోని మదర్ మోడల్ హై స్కూల్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సెలవులు సందర్భంగా చివరి రోజు పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆటల పోటీలను నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను ధరించి వివిధ రకాల ముగ్గులను పిండి వంటలను తయారు చేసి భోగి మంటలను వేసి సాంప్రదాయంగా నృత్యాలను చేయడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి పండుగ విశేషాల గురించి విద్యార్థులకు కరస్పాండెంట్ శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాయసం మురళీమోహన్, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️