ప్రజాశక్తి – పుట్లూరు (అనంతపురం) : మండలంలో ఆటో డ్రైవర్లకు బుధవారం హేమాద్రి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గురించి ఆటో డ్రైవర్లకు మరియు వాహనదారులకు అలాగే ప్యాసింజర్లకు వివరించడం జరిగింది. దీనిలో భాగంగా డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఆటోలలో ఓవర్ లోడ్ ఎక్కించుకోకూడదు అన్ని రికార్డ్స్ తప్పకుండా పెట్టుకోవాలి ఎస్సై ఆటో డ్రైవర్లకు సూచించారు. అనంతరం ఏ కొండాపురం వద్ద అనంతపురం తాడపత్రి రహదారి పైన వాహనాలు తనిఖీ నిర్వహించారు. అధికలోడుతో వెళ్తున్న ఆటోల డ్రైవర్లకు అపరాధ రుసు విధించినట్లు ఎస్సై తెలిపారు