సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ఊపందుకుంది. గురువారం రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి డిసెంబర్ ఎనిమిదో తేదీన సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొనడం తెలిసిందే. కడప, అన్నమయ్య జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ల పర్యవేక్షణలో ఇరిగేషన్, రెవెన్యూ అధికార యంత్రాంగం శిక్షణ తరగతుల దగ్గర నుంచి సభ్యత్వ నమోదు పోలింగ్ నిర్వహించే ప్రయ త్నాల్లో నిమగమైంది. ఈ నెల ఐదున నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్దం చేసింది. అనంతరం ఎనిమిదో తేదీ నుంచి 14 తేదీల నాటికి చిన్నతరహా, మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలకు సైతం ఎన్నికలు నిర్వహించడానికి పూర్వ రంగాన్ని సిద్ధం చేశారు. ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 94 సాగునీటి సంఘాలు ఉన్నాయి. కడప జిల్లా సాగునీటి పారుదల శాఖ పరిధిలో ఆరు ఇరిగేషన్ సర్కిల్స్ పరిధిలోని మైనర్ 112, మీడియం 16, మేజర్ 78 వెరసి 206 సాగునీటి సంఘాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద 94 సాగునీటి సంఘాలు ఉండడం గమనార్హం. 2015లో అప్పటి టిడిపి సర్కారు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. సుమారు పదేళ్లుగా సాగునీటి సంఘాలు మనుగడలో లేక పోవడంతో రైతుల్లో ఉత్సాహం కొరవడినట్లు కనిపిస్తోంది. 8న ఎన్నికలు షురూ! ఈ నెల ఎనిమిదిన సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేశాయి.కడప, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా చెరువుల గుర్తింపు దగ్గర నుంచి సుమారు ఆరుగురు చొప్పున ఇరిగేషన్ ఎఇల దగ్గర నుంచి రెవెన్యూశాఖలో తహశీల్దార్ స్థాయి అధికారుల జాబితాను సిద్ధం చేయడం తెలిసిందే. డిసెంబర్ ఐదున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం ఎనిమిదిన పోలింగ్ నిర్వహించనుంది. ఆయా సాగునీటి సంఘాల వారీగా రైతులను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నం చేయనుంది. పోటీ అనివార్యమైన పక్షంలో సాగునీటి సంఘాలకు చెందిన సభ్యులు చేతిని ఎత్తి ఎన్ను కోవడమా, లేనిపక్షంలో స్లిప్‌ల ద్వారా వేసిన ఓట్లను లెక్కించిన అనం తరం అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. కెసికె నాల్, మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల సాగు సంఘాల ఎన్నికలు నిర్వహి స్తారు. అనంతరం 14న ఆయా డిస్ట్రిబ్యూటరీలకు చైర్మన్, వైస్ ఛైర్మన్ల అభ్యర్థుల నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫైసలేవీ..!సాగునీటి సంఘాల ఎన్నికలు సరే, నిధుల కేటాయింపుల సంగతేమిటో తెలియడం లేదు. ఇప్పటి వరకు ఆయా జిల్లాలకు చెందిన ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగాలకు అవగాహన కల్పించడం వరకు పైసా అవసరం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహ ణకు నిధులు కేటాయించాల్సి ఉంది. పోలింగ్ గడువు దగ్గర పడుతున్నప్పటికీ కేటాయింపులు చేయని పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ సంబంధించి పోలింగ్ సామగ్రి తరలించడం మొదలుకుని టి.ఎ, డిఎ, ఇతర ఎన్నికల అవసరాలకు నిధులు కేటాయించకపోతే ఎలా అనే వాదన వినిపిస్తోంది.