సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కౌంట్‌డౌన్ మొదలైంది. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన నీటిపారుదల శాఖ ఆయా కలెక్టర్ల ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఇరిగేషన్, రెవెన్యూ అధికార యంత్రాంగాలు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాయి. ఈ నెల 14న చెరువులకు, 17న డిస్ట్రిబ్యూటరీలకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణలో నిమగమైంది. ఉమ్మడి జిల్లాలకు చెందిన 300 చెరువుల కింద పంటలు సాగు చేస్తున్న రైతుల సభ్యత్వ నమోదు దగ్గర నుంచి ఎన్నికల అధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణపై అవ గాహన కల్పించడం వంటి చర్యలతో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థా యిలో సిద్ధమైంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఉమ్మడి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా నీటిపారుదల శాఖ, రెవెన్యూ యంత్రాంగాలు పరస్పర సమన్వయంతో ఎన్నికల అధికారుల శిక్షణ తరగతుల దగ్గర నుంచి రైతుల సభ్యత్వాలు, కౌంటింగ్ తీరుతెన్నుల వరకు ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సరంజామాతో సిద్ధమయ్యాయి. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం గమ నార్హం. కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 94 సాగునీటి సంఘాలు ఉన్నాయి. జిల్లా సాగునీటి పారుదలశాఖ పరిధిలో ఆరు ఇరిగేషన్ సర్కిల్స్ పరిధి లోని మైనర్ 112, మీడియం 16, మేజర్ 78 వెరసి 206 సాగునీటి సంఘాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద 94 సాగునీటి సంఘాలు ఉన్నాయి. 2015లో అప్పటి టిడిపి సర్కారు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. సుమారు పదేళ్లుగా సాగునీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో రైతుల్లో ఉత్సాహం కొరవడినట్లు కనిపిస్తోంది. ఎట్టకేలకు నోటిఫికేషన్ ఎట్టకేలకు బుధవారం సాగునీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో రెండు దఫాలుగా ఎన్నికల తేదీలు వాయిదా పడడంతో ఎన్నికల నిర్వహణపై నిరుత్సాహం నెలకొంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల నీటి పారుదలశాఖా మంత్రి ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఇప్పటికే ఆయా మండలాల వారీగా చెరువులు, రైతుల సభ్యత్వాల జాబితాలతో సిద్ధమై ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారిం చింది. చెరువుల జాబితా రూపకల్పన అనం తరం ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ స్థాయి అధికారులను నియా మకాలను పూర్తి చేసింది. వీరికి అనుబంధంగా ఆయా మండలాలకు చెందిన తహశీల్దార్ స్థాయి అధికారుల నియామకాలతో సిద్ధం కావడం గమనార్హం. పారదర్శక ఎన్నికలు సాగేనా!2015లో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల ఫలితాల ప్రకటనలో పారదర్శకత కొరవడిన సంగతి తెలిసిందే. అప్పటి సాగునీటి సంఘాల ఎన్నికలను అధికార పార్టీ మెజార్టీ సంఘాలను ఏకగ్రీవం చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఒంటిమిట్ట సాగునీటి సంఘ ఎన్నికపై ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయించిన ఘటనలు ఉన్నాయి. తాజా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణలో అప్రజాస్వామిక పోకడలు పునరావృతం గాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా రాష్ట్రప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల్లో రహస్య బ్యాలె ట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాంసాగునీటి సంఘాలకు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రహస్య బ్యాలెట్ విధానానికి మొగ్గు చూపించడంతో అనైతికతకు ఆస్కారం లేకుండా పోయింది.- కె.శ్రీనివాసులు, ఎస్‌ఇ, ఇరిగేషన్, కడప.
