ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల తాసిల్దార్ కార్యాలయన్ని బుధవారం అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు.కు మండల కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి సాకే గంగాధర మాట్లాడుతూ నార్పల మండల కేంద్రంలో సర్వేనెంబర్ 196, 197, 11/ఎ లో గత ప్రభుత్వంలో అనార్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి అనర్హులు అందరిని తొలగించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇళ్ల పట్టాలి ఇవ్వాలని సిపిఐ నాయకులు ఆర్డీవోకి సమర్పించారు. ఆర్డీవో స్పందిస్తూ దీనిపైన క్షుణంగా పరిశీలన చేసి అనర్హులు ఎవరైనా ఉన్నారో వారందరినీ తొలగించి నిజమైనటువంటి అర్హులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సాకే.గంగాధర్ సీనియర్ నాయకులు సుధాకర్ నాగరాజు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య, నారాయణప్ప, తిమ్మిరాజు , తదితరులు పాల్గొన్నారు..
