ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి 5వ వార్డు పరిధిలో నివాసముంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు కోరారు. శివశక్తినగర్‌లో పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇక్కడ 54 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించి పక్కా గృహాలు నిర్మించి శివశక్తినగర్ పేరును సిపిఐ పెట్టిందని తెలిపారు. ఈ సంవత్సరం పార్టీ శత వార్షికోత్సవాలు సందర్భంగా సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పునరంకితమౌతామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సమితి సభ్యులు ఎమ్‌డి బేగం, ఏరియా కార్యదర్శి వి.సత్యనారాయణ, బి.కేశవయ్య, ఎస్‌కె.సల్మా, పైడి అన్నాజీ, మీసాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.